హైదరాబాద్:మాజీ మంత్రి మల్లారెడ్డి, బీఆర్ ఎస్ నేత మల్లారెడ్డికి ఈడీ నోటీసులిచ్చింది. గురువారం( నవంబర్7) పీజీ మెడికల్ సీట్ల అక్రమాల కేసులో ఈడీ విచారణ చేపట్టింది. ఈడీ విచారణకు మల్లారెడ్డి మెడికల్ కాలేజీ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ సురేందర్ రెడ్డి హాజరయ్యారు.
అసెంబ్లీ ఎన్నికలకు ముందు మాజీ మంత్రి మల్లారెడ్డి ఇంటిపై దాడులు చేసి సోదాలు చేసిన విషయం తెలిసిందే. పీజీ మెడికల్ సీట్లు అక్రమంగా బ్లాక్ చేశారన్న ఆరోపణలపై వివరణ కోరుతూ నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు.
ష్ట్రంలో 10 ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో 45 మెడికల్ సీట్లు బ్లాక్ చేసి అమ్ముకున్నట్లు ఈడీ గుర్తించినట్లు తెలిపారు. ఈ క్రమంలో మాజీ మల్లారెడ్డికి నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది.