క్యాసినో కేసులో తలసాని సోదరులను ప్రశ్నిస్తున్న ఈడీ

క్యాసినో కేసులో తలసాని సోదరులను ప్రశ్నిస్తున్న  ఈడీ

చీకోటి ప్రవీణ్ క్యాసినో వ్యవహారంలో ఈడీ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఆయనతో సంబంధాలున్న వారి గురించి ఆరా తీస్తోంది. ఇందులో భాగంగా మంత్రి తలసాని శ్రీనివాస్ సోదరులను ఈడీ విచారిస్తోంది. తలసాని మహేశ్, తలసాని ధర్మేందర్ యాదవ్ ను ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. వారి నుంచి మనీ లాండరింగ్, క్యాసినో కేసుకు సంబంధించి ఈడీ వివరాలు సేకరిస్తోంది. తలసాని సోదరుల ఆర్థిక లావాదేవీలపైనా అధికారులు దృష్టి సారించారు. 

ఇప్పటికే ఈ కేసులో చీకోటి ప్రవీణ్‌తో పాటు ఆయన సన్నిహితులను ఈడీ అధికారులు పలుమార్లు విచారించారు. అంతకు ముందు చీకోటి ప్రవీణ్ ఇంట్లో సోదాలు నిర్వహించిన ఈడీ అధికారులు.. విచారణకు హాజరుకావాలని నోటీసులు అందజేశారు. ఈ క్రమంలోనే ఈడీ విచారణకు హాజరైన చీకోటి.. అధికారులు అడిగిన ప్రశ్నలకు తాను సమాధానం ఇచ్చినట్లు చెప్పారు.