అంతా ఆఫీసర్లకే తెలుసు: ఈడీ ప్రశ్నలకు కేటీఆర్ సమాధానం

  • విదేశీమారకం బదిలీపై ప్రశ్నలు
  • బ్యాంక్ టు బ్యాంక్ లావాదేవీలే జరిగాయంటున్న కేటీఆర్

హైదరాబాద్: మాజీ మంత్రి కేటీఆర్‎ను ఫార్ములా ఈ రేస్ కేసులో ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఉదయం 10.30 గంటలకు ఆయన విచారణ ప్రారంభమైంది. మధ్యాహ్నం 1.30 నుంచి 2.30 గంటల మధ్య లంచ్ బ్రేక్ ఇచ్చిన ఆఫీసర్లు ఆ తర్వాత విచారణ ప్రారంభించారు. ఈడీ అధికారులు అడిగిన ప్రశ్నలకు తనకేం తెలియదని, అంతా అధికారులకే తెలుసునని సమాధానం చెబుతున్నట్టు తెలుస్తోంది. 

ALSO READ | పార్టీ మారిన పది మందిపై అనర్హత వేయండి.. సుప్రీం కోర్టులో BRS పిటిషన్

విదేశీ సంస్థలకు రూ. 45 కోట్లను ఎందుకు బదిలీ చేశారన్న ప్రశ్నకు తనకు తెలియదని చెప్పారని సమాచారం. బ్యాంకర్లు ఆ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటే సమస్య ఇంత దాకా వచ్చేది కాదని చెబుతున్నారని తెలుస్తోంది. బ్యాంక్- టు- బ్యాంక్ లావాదేవీలు జరిగాయని చెప్పారని సమాచారం. ఒక్క రూపాయి కూడా దుర్వినియోగం కాలేదని, ప్రతి రూపాయికి క్లియర్‎గా లెక్క ఉందని చెప్పినట్టు సమాచారం.