న్యూఢిల్లీ: అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌కు దగ్గర సంబంధం ఉన్న కొంత మంది సెల్లర్ల ఆఫీసుల్లో ఈడీ దాడులు చేసిందని రాయిటర్స్ పేర్కొంది. ఈ ఈ–కామర్స్ కంపెనీలు ఫారిన్ ఇన్వెస్ట్‌మెంట్ చట్టాలను ఉల్లంఘించాయనే ఆరోపణల నేపథ్యంలో దాడులు జరిపిందని తెలిపింది. అమెజాన్ ఇండియా, ఫ్లిప్‌కార్ట్ (వాల్‌మార్ట్) ఓనర్ కంపెనీలు విదేశీ సంస్థలనే విషయం తెలిసిందే.
కాగా, ఫారిన్ ఈ-–కామర్స్ కంపెనీలు ప్రొడక్ట్‌లను నిల్వ చేయకూడదు. కేవలం ఇండిపెండెంట్ సెల్లర్లకు ప్లాట్‌ఫామ్‌గా మాత్రమే పనిచేయాలి. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ కొందరు సెల్లర్లకు అనుకూలమనే ఆరోపణలు ఉన్నాయి.