
న్యూఢిల్లీ: ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేంద్ర జైన్ నివాసంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. జైన్ ఇంటితో పాటు మరికొన్ని చోట్ల తనిఖీలు చేపట్టారు. మనీలాండరింగ్ కేసులో గత నెల 30న ఈడీ సత్యేంద్ర జైన్ను అరెస్టు చేసింది. ఈ కేసుకు సంబంధించి దర్యాప్తులో భాగంగా సోమవారం తెల్లవారుజాము నుంచి అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు.
The Enforcement Directorate (ED) today conducted searches at the residence of Delhi's Health and Home Minister Satyendar Jain in connection with hawala transactions related to a Kolkata-based company.
— ANI (@ANI) June 6, 2022
(File photo) pic.twitter.com/X9QKs1oD7R
కోల్కతాకు చెందిన ఓ కంపెనీకి సత్యేంద్ర జైన్ అక్రమంగా డబ్బులు ట్రాన్స్ ఫర్ చేసినట్లు ఈడీ దర్యాప్తులో తేలింది. ఈ క్రమంలోనే దర్యాప్తు సంస్థ ఏప్రిల్లో ఆయనకు సంబంధించి రూ.4.81కోట్ల విలువైన స్థిరాస్థులను జప్తు చేసింది. మనీలాండరింగ్ ఆరోపణలపై సరైన వివరణ ఇవ్వలేదన్న కారణంతో జైన్పై క్రిమినల్ కేసు నమోదుచేసింది. ఈ నేపథ్యంలో మే 30న అరెస్టైన ఆయనను కోర్టు జూన్ 9 వరకు ఈడీ కస్టడీకి ఇచ్చింది. సత్యేంద్రజైన్ అరెస్ట్పై స్పందించిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సత్యేంద్ర జైన్ అరెస్టు ఖండించారు. ఆయనపై తప్పుడు కేసు బనాయించారని ఆరోపించారు.
మరిన్ని వార్తల కోసం..