మహేశ్ బ్యాంక్ కేసులో రూ.కోటి సీజ్

మహేశ్ బ్యాంక్ కేసులో రూ.కోటి సీజ్
  • రూ.4 కోట్ల జ్యువెలరీ, 6256 యూఎస్ డాలర్లు స్వాధీనం

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు: ఏపీ మహేశ్ కో ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ మనీలాండరింగ్ కేసులో ఎన్​ఫోర్స్​మెంట్‌‌ డైరెక్టరేట్‌‌ (ఈడీ) సోదాలు పూర్తయ్యాయి. బ్యాంక్ చైర్మన్‌‌, ఎండీ, వైస్ చైర్మన్‌‌, డైరెక్టర్ల ఇండ్లతో సహా మొత్తం ఏడు ప్రాంతాల్లో బుధవారం రాత్రి వరకు తనిఖీలు చేశారు. ఈ సోదాల్లో రూ.కోటి నగదు, రూ.4.27 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు, 6256 యూఎస్‌‌ డాలర్లు, ప్రాపర్టీ డాక్యుమెంట్స్, బ్యాంక్ లాకర్ కీస్, డిజిటల్ డివైజ్‌‌ ‌లు స్వాధీనం చేసుకున్నారు.

బ్యాంక్ చైర్మన్‌‌ ‌‌  రమేశ్ కుమార్ బంగ్‌‌, ఎండీలు ఉమేశ్ చంద్‌‌ ‌‌అస్వా, పురుషోత్తందాస్‌‌ కలిసి రూ.300 కోట్లు అక్రమాలకు పాల్పడినట్లు ఈడీ అధికారులు గురువారం ఓ ప్రకటనలో వెల్లడించారు. గోల్డ్‌‌ లోన్స్‌‌కు సంబంధించి నిందితులు 10 శాతం కమీషన్ తీసుకున్నట్లు తెలిపారు. మొత్తం రూ.318 కోట్లు మనీలాండరింగ్‌‌కు పాల్పడ్డారని అధికారులు పేర్కొన్నారు. వక్ఫ్‌‌ బోర్డ్‌‌ ‌‌భూములు, ఇతర ప్రాపర్టీల పేరుతో 1,800 మంది డమ్మీ కస్టమర్లను సృష్టించి అక్రమాలకు పాల్పడినట్లు షేర్‌‌ హోల్డర్స్‌‌ అసోసియేషన్ ఫిర్యాదుతో గతంలో బంజారాహిల్స్‌‌ పీఎస్‌‌లోఎఫ్‌‌ఐఆర్ నమోదు అయ్యింది.