సిరిసిల్ల బట్టల వ్యాపారులపై ఈడీ దాడులు

రాజన్న సిరిసిల్ల, వెలుగు : సిరిసిల్లలో  కేంద్ర చేనేత జౌళిశాఖ ఎన్​ఫోర్స్ మెంట్ (ఈడీ)  ఆఫీసర్లు బుధవారం దాడులు నిర్వహించారు. టౌన్ సీఐ అనిల్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. చేనేత జౌళిశాఖ ఎన్​ ఫోర్స్ మెంట్ డిపార్ట్​మెంట్ (ఈడీ) ఆఫీసర్లు  మనోహర్, స్టేట్ డిప్యూటీ డైరెక్టర్ వెంకటేశంలకు పవర్​లూమ్స్​పై ఉత్పత్తి చేసిన కాటన్ బట్టలను మార్కెట్ లో అమ్ముతున్నారని  ఫిర్యాదు అందింది. దీంతో వారు సిరిసిల్ల నెహ్రూ నగర్ కు చెందిన  బట్టల వ్యాపారి అన్నల్దాస్​ శ్రీనివాస్ , బచ్చు శ్రీనివాస్  చేనేత పరిశ్రమకు రిజర్వ్​ చేసిన బట్టలను పవర్​లూమ్స్​ పై ఉత్పత్తి చేస్తున్నారు. చేనేత మగ్గం హ్యాండ్లూమ్ పై ఉత్పత్తి చేయాల్సిన బట్టలను పవర్​లూమ్​పై ఉత్పత్తి చేయడం  చేనేత రిజర్వేషన్ చట్టం – 1985 ప్రకారం నేరం. దీంతో ఈడీ ఆఫీసర్లు తనిఖీలు చేసి  రూల్స్​ అతిక్రమించినట్టు నిర్ధారించారు.  వారిపై టౌన్​ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు.