ED Raids: ఆప్ ఎంపీ సంజయ్ ఆరోరా ఇంట్లో ఈడీ సోదాలు

ED Raids: ఆప్ ఎంపీ సంజయ్ ఆరోరా ఇంట్లో ఈడీ సోదాలు

భూకుంభకోణం కేసులో ఆప్ ఎంపీ సంజీవ్ అరోరా ఇంట్లో ఈడీ సోదాలు చేసింది. జలంధర్, లుథియానా, గురుగ్రామ్, ఢిల్లీలోని సంజీవ్ అరోరా ఇళ్లలో ఏకకాలంలో సోదాలు చేశారు ఈడీ అధికారులు. 

మరోవైపు జలంధర్‌లోని రియల్ ఎస్టేట్ వ్యాపారి హేమంత్ సూద్ కేసులో చంద్రశేఖర్ అగర్వాల్ అనే వ్యక్తికి సంబంధించిన ఇళ్లలో కూడా సోదాలు నిర్వహించారు ఈడీ అధికారులు. 

Also Read :- నెరవేరిన ప్రీతి జింటా కల

ఈడీ దాడులపై ఆప్ ఎంపీ సంజీవ్ స్పందిస్తూ.. నేను చట్టాన్ని గౌరవిస్తాను.. దర్యాప్తు సంస్థలకు సహకరిస్తాను అని అన్నారు. ఎంపీ సంజీవ్ ఇంటిపై సోదాలను ఆప్ నేత, ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా తీవ్రంగా ఖండించారు. తమ పార్టీని విచ్ఛిన్నం చేరసేందుకు ఆప్ నేతలపై దాడులు చేస్తున్నారని సోషల్ మీడియా ప్లాట్ పాం ఎక్స్ లో పోస్ట్ చేశారు. 

మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA) కింద ఈ సోదాలు నిర్వహించినట్లు ఈడీ అధికారులు తెలిపారు. భూ కుంభకోణం కేసుతో ముడిపడి ఉందన్నారు. 
ఆప్ ఎంపీ సంజీవ్ అరోరాపై చట్టవిరుద్దంగా ఇండస్ట్రీయల్ ప్లాట్ ను బదిలీ చేసినట్లు ఆరోపణలున్నాయి.