సురానా సంస్థల్లో రూ.74 లక్షలు సీజ్‌‌

సురానా సంస్థల్లో రూ.74 లక్షలు సీజ్‌‌

హైదరాబాద్‌‌, వెలుగు: సురానా గ్రూప్‌‌ ఆఫ్‌‌ కంపెనీల్లో ఈడీ సోదాలు గురువారం ముగిశాయి. సురానా అనుబంధ కంపెనీలైన సాయిసూర్య డెవలపర్స్‌‌, భాగ్యనగర్ ప్రాపర్టీస్‌‌లో జరిపిన ఈ సోదాల్లో రూ.100 కోట్ల అక్రమ లవాదేవీలను ఈడీ ఆఫీసర్లు గుర్తించారు.మొత్తం రూ.74.5 లక్షల నగదును సీజ్‌‌ చేసింది. 

మాదాపూర్‌‌‌‌, జూబ్లీహిల్స్, బోయిన్‌‌పల్లిలోని సురానా గ్రూప్ కంపెనీ చైర్మన్ నరేందర్ సురానా, ఎండీ దేవేందర్ సురానా ఇండ్లతో పాటు సాయిసూర్య డెవలపర్స్‌‌ కార్యాలయాల్లో కీలక ఆధారాలు సేకరించారు. సురానా సంస్థ వట్టినాగులపల్లిలో రియల్ ఎస్టేట్‌‌ వెంచర్ల పేరుతో భారీ మోసాలకు పాల్పడినట్లు నిర్ధారించారు. ఇన్వెస్టర్ల నుంచి వసూలు చేసిన డబ్బును షెల్‌‌ కంపెనీలకు మళ్లించినట్లు ఆధారాలు సేకరించారు.