ఫార్ములా ఈ రేసులో నోటీసులు ఇచ్చేందుకు రెడీ అయింది ఈడీ. ఇప్పటికే ఈ ఇష్యూపై కేసు నమోదు చేసింది. మొదటి రెండు ఫార్ములా రేసులకుబంధించి డాక్యుమెంట్స్ తెప్పించుకుంది ఈడీ. కేసులో మాజీమంత్రి కేటీఆర్ తోపాటు నిందితులందరికీ నోటీసులు ఇచ్చేందుకు కసరత్తు చేస్తోంది.
ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్, అర్వింద్ కుమార్,బీఎల్ఎన్ రెడ్డిపై ఈడీ కేసు పెట్టిన సంగతి తెలిసిందే. డిసెంబర్ 20న ఉదయం ఫార్ములా -E కేసుకు సంబంధించి డిటైల్స్ ఇవ్వాలని ఏసీబీకి ఈడీ లేఖరాసింది. ACB నుంచి FIR కాపీ అందటంతో ECIR నమోదు చేసింది ఈడీ. ఫార్ములా-E రేస్ కేస్ లో A1, A2, A3లపై కేసులు పెట్టింది ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్. ఫెమా ఉల్లంఘన, మనీ లాండరింగ్ కింద కేసు నమోదు చేసింది.
విచారణకు ఒకే చెప్పిన హైకోర్టు
కేటీఆర్ పై ఫార్ములా ఈ రేస్ కేసులో ఏసీబీ విచారణకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. కేటీఆర్ ను 10 రోజుల పాటు అరెస్ట్ చేయొద్దని.. అయితే ఏసీబీ విచారణ కొనసాగించవచ్చని చెప్పింది. ఫార్ములా ఈ కార్ రేసులో ఏసీబీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ క్వాష్ చేయాలని కేటీఆర్ హైకోర్టులో పిటిషన్ వేశారు. విచారణ సందర్బంగా ఇరు వర్గాల వాదనలు విన్న హైకోర్టు.. కేటీఆర్ ను డిసెంబర్ 30 వరకు అరెస్ట్ చేయొద్దని ఆదేశించింది.కేసు కొట్టేయాలన్న కేటీఆర్ వాదనను తిరస్కరించింది. కేసులో విచారణకు ఎవరినైనా పిలవొచ్చని తెలిపింది. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని ఏసీబీని ఆదేశించింది. తదుపరి విచారణను డిసెంబర్ 27కు వాయిదా వేసింది కోర్టు.