సీఎం సిద్ధరామయ్యకు మరో బిగ్ షాక్.. ముడా స్కామ్ కేసులో రంగంలోకి ఈడీ

సీఎం సిద్ధరామయ్యకు మరో బిగ్ షాక్.. ముడా స్కామ్ కేసులో రంగంలోకి ఈడీ

బెంగుళూర్: కన్నడ రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతోన్న  మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (ముడా) భూ కుంభకోణంలో మరో కీలక పరిణామం చోటు  చేసుకుంది. ముడా స్కామ్ ఇష్యూలో కర్నాటక సీఎం సిద్ధరామయ్యపై ఇప్పటికే లోకాయుక్త పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ముడా స్కామ్‎కు సంబంధించి త్వరలోనే సీఎం సిద్ధరామయ్యను విచారించేందుకు లోకాయుక్త పోలీసులు రెడీ అవుతున్నారు. ఈ క్రమంలో ముడా భూ కుంభకోణం కేసులోకి ఎవరూ ఊహించని విధంగా కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్‎ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఎంట్రీ ఇచ్చింది.

 ముడా స్కామ్‎కు సంబంధించి లోకాయుక్త పోలీసుల కేసు ఆధారంగా మనీలాండరింగ్ ఆరోపణలపై ఈడీ సైతం కేసు నమోదు చేసింది. సీఎం సిద్ధరామయ్యతో పాటు మరికొంతమందిపైనా ఈడీ కేసు ఫైల్ చేసింది. ఇప్పటికే సిద్ధరామయ్యను విచారించేందుకు లోకాయుక్త పోలీసులు సిద్ధం అవుతుండగా.. ఈ తరుణంలో మనీలాండరింగ్ ఆరోపణలపై ఈడీ కేసు నమోదు చేయడం కర్నాటక రాజకీయాల్లో కాక రేపుతోంది. ఈడీ ఎంట్రీతో ముడా స్కామ్ కేసు ఏ వైపునకు దారి తీస్తుందోనని కన్నడ పాలిటిక్స్‎లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. 

అసలు ముడా స్కామ్ కేసు ఏంటంటే..?

సిద్ధరామయ్య భార్య పార్వతమ్మ పేరిట ఉన్న భూములను గతంలో అభివృద్ధి పనుల కోసం మైసూర్​అర్బన్​ డెవలప్​మెంట్​అథారిటీ (ముడా) సేకరించింది. అయితే దానికి ప్రతిఫలంగా అప్పట్లో సిద్ధరామయ్య  సీఎంగా ఉన్న టైమ్‎లో ఖరీదైన స్థలాలను సొంత ఫ్యామిలీకి కేటాయించారని ఫిర్యాదులు వచ్చాయి. దీంతో సిద్ధరామయ్యను విచారించాలని గవర్నర్ ఆదేశాలు ఇచ్చారు. గవర్నర్ ఆదేశాలను సవాల్ చేస్తూ సిద్ధరామయ్య హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దానిపై విచారణ చేపట్టిన సింగిల్ జడ్జి జస్టిస్ ఎం.నాగప్రసన్న తీర్పు వెలువరించారు. 

ALSO READ | హిండెన్‌‌‌‌‌‌‌‌బర్గ్ రిపోర్ట్​పై మోదీ మాట్లాడరేం: కర్నాటక సీఎం సిద్ధరామయ్య

గవర్నర్ చట్టప్రకారమే విచారణకు ఆదేశించారని, అందులో ఎలాంటి లోపాలు లేవని పేర్కొన్నారు. అయితే తీర్పుపై రెండు వారాలు స్టే ఇవ్వాలని  సిద్ధరామయ్య తరఫు లాయర్ అభిషేక్ మను సింఘ్వీ కోరగా.. తాను ఇచ్చిన ఆదేశాలపై తానే స్టే విధించలేనని జడ్జి తెలిపారు. కాగా, హైకోర్టు తీర్పుతో సీఎం సిద్ధరామయ్యను విచారించేందుకు ట్రయల్ కోర్టు లోకాయుక్తకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ట్రయల్ ఆదేశాల మేరకు కర్నాటక లోకాయుక్త విభాగం సీఎం సిద్ధరామయ్య, అతడి సతీమణితో పాటు మరికొందరిపై కేసు నమోదు చేసి విచారణ చేసేందుకు రెడీ అయ్యింది.