
చెన్నై: డీఎంకే సీనియర్ నేత, తమిళనాడు మున్సిపల్ శాఖ మంత్రి కేఎన్ నెహ్రూకు చెందిన నివాసాల్లో సోమవారం ఈడీ సోదాలు చేసింది. చెన్నై. తిరుచిరాపల్లి, కోయంబత్తూరుతో పాటు పలు ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టింది. అందులో భాగంగా ఈడీ అధికారులు పలు రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. కేఎన్ నెహ్రూ సోదరుడు కేఎన్ రవిచంద్రన్ ప్రమోట్‌చేసిన రియల్ ఎస్టేట్ సంస్థ టీవీహెచ్ గ్రూప్‌పై దర్యాప్తులో భాగంగా ఈడీ రెయిడ్స్ చేసింది. ఈడీ సోదాలపై తమిళనాడు లా మినిస్టర్ స్పందిస్తూ కేంద్రా న్ని విమర్శించారు. టీడీపీ, జేడీయూల మాదిరే ఈడీ కూడా బీజేపీ భాగస్వామి అని ఆరోపించారు.