న్యూఢిల్లీ: రియల్ ఎస్టేట్ సంస్థ సూపర్‌టెక్, దాని ప్రమోటర్లపై మనీలాండరింగ్ కేసు దర్యాప్తులో భాగంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) గురుగ్రామ్‌లోని డీఎల్‌ఎఫ్ ఆఫీసులో సోదాలు చేసింది. ఈ సందర్భంగా కొన్ని పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు ఈడీ శనివారం పేర్కొంది. ఈ కేసులో సూపర్‌టెక్‌కు కూడా ప్రమేయం ఉందని ఉందని ఏజెన్సీ వర్గాలు తెలిపాయి. ఈ విషయమై డీఎల్‌ఎఫ్‌కి పంపిన ఈ–మెయిల్‌కు స్పందన రాలేదు. అయితే, ఈ సోదాలు కొన్ని ఇతర పార్టీలకు సంబంధించినవని, డీఎల్‌ఎఫ్‌కి సంబంధించినవి కాదని కంపెనీ వర్గాలు తెలిపాయి. ఈ లావాదేవీకి సంబంధించిన కొన్ని డాక్యుమెంట్లను వెరిఫై చేయాలని ఈడీ అధికారులు కోరారని, కంపెనీ ఇందుకు సిద్ధంగా ఉందని పేర్కొన్నాయి.
ఈ కేసులో సూపర్‌టెక్ ప్రమోటర్ రామ్ కిషోర్ అరోరాను జూన్‌లో ఈడీ అరెస్ట్ చేసింది. ప్రస్తుతం ఆయన జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. పెట్టుబడిదారుల, ఇండ్ల కొనుగోలుదారులకు చెందిన కోట్లాది నిధులను వివిధ షెల్ కంపెనీలకు మళ్లించాలని నిర్ణయించుకున్న గ్రూప్‌లో అరోరా ప్రధాన వ్యక్తి అని ఈడీ ఆరోపించింది. ప్రివెన్షన్ ఆఫ్ మనీలాండరింగ్ యాక్ట్ (పీఎమ్‌ఎల్‌ఏ) క్రిమినల్ సెక్షన్ల కింద దాఖలైన మనీలాండరింగ్ కేసును, ఢిల్లీ, హర్యానా ఉత్తరప్రదేశ్ పోలీసు శాఖలు సూపర్‌టెక్ లిమిటెడ్ దాని గ్రూప్ కంపెనీలపై నమోదైన 26 ఎఫ్‌ఐఆర్‌ల ఆధారంగా నమోదు చేశారు. నిందితులు 670 మంది హోమ్‌బయర్‌లను రూ.164 కోట్లకు మోసం చేశారని ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు.
సూపర్‌టెక్ గ్రూప్ ద్వారా భారీ మొత్తంలో వందల కోట్ల రూపాయల డబ్బులు జేబులో వేసుకున్నారని, కస్టమర్లకు సకాలంలో ఫ్లాట్‌లను ఇవ్వలేదని, ఈడీ పేర్కొంది. సూపర్‌టెక్ గ్రూప్ గురుగ్రామ్‌లో అధిక ధరలకు భూమిని కొనుగోలు చేసినందుకు కస్టమర్లు, కొనుగోలుదారుల నుంచి తీసుకున్న డబ్బును దుర్వినియోగం చేసిందని స్పష్టం చేసింది. నోయిడా ప్రాజెక్టు కూడా కాలేదని పేర్కొన్నది. బ్యాంకుల నుంచి లోన్లు తీసుకొని ఎగ్గొట్టిందని తెలిపింది.