ప్రైవేట్​ మెడికల్​ కాలేజీల్లో ఈడీ సోదాలు.. 

రాష్ట్రంలో ఈడీ అధికారుల సోదాలు కలకలం రేపుతున్నాయి. ఈ సారి మెడికల్​ కాలేజీలే టార్గెట్​గా సోదాలు జరుగుతున్నట్లు సమాచారం. వీటిల్లో ఆరు మెడికల్​ కాలేజీలు ఉన్నాయి.

మహబూబ్ నగర్​, హైదరాబాద్​లోని ఎస్వీఎస్​ మెడికల్​ కాలేజీ రిసర్చ్ సెంటర్​, కామినేని, ప్రతిమ తదితర కళాశాలలో ఏకకాలంలో రైడ్స్​ జరుగుతున్నాయి. మొత్తం 11 బృందాలు ఇందులో పాల్గొన్నట్లు సమాచారం. ఆయా తనిఖీల్లో నలుగురు ఈడీ అధికారులతో, సీఆర్ పీఎఫ్​ సిబ్బంది ఉన్నారు. కామినేని ఆసుపత్రి ఛైర్మన్​ సూర్యనారాయణ, ఎండీ శ్రీధర్​ నివాసాల్లోనూ ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి. కరీంనగర్​ రూరల్​ మండలం నగనూరులోని ప్రతిమా కాలేజ్​ కూడా ఇందులో ఉంది.  హైదరాబాద్‌తో పాటు నల్గొండ, రంగారెడ్డి, మహబూబ్నగర్, మేడ్చల్ జిల్లాలో రైడ్స్ జరిగే అవకాశం ఉంది. కార్ఖానా, చౌటుప్పల్, జడ్చర్ల, చేవెళ్ల, పివి ఎక్స్ప్రెస్ వే ,గచ్చిబౌలి ఓఆర్ఆర్, శామీర్ పేట్ వైపు బృందాలు వెళ్లాయి.