రూ.1,646 కోట్ల క్రిప్టో కరెన్సీలు సీజ్‌‌‌‌‌‌‌‌

రూ.1,646 కోట్ల క్రిప్టో కరెన్సీలు సీజ్‌‌‌‌‌‌‌‌

న్యూఢిల్లీ: ఓ మనీ లాండరింగ్ కేసులో రూ.1,646 కోట్ల విలువైన క్రిప్టో కరెన్సీలను ఎన్‌‌‌‌‌‌‌‌ఫోర్స్‌‌‌‌‌‌‌‌మెంట్ డైరెక్టరేట్‌‌‌‌‌‌‌‌ (ఈడీ)  సీజ్ చేసింది. మోసపూరిత ఇన్వెస్ట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ స్కీమ్‌‌‌‌‌‌‌‌ వలన  డిపాజిటర్లు భారీగా నష్టపోయారని అధికారులు తెలిపారు.  ఈ స్కీమ్‌‌‌‌‌‌‌‌కు సంబంధించి  మనీ లాండరింగ్‌‌‌‌‌‌‌‌ యాంగిల్‌లో దర్యాప్తు జరుపుతున్నామని అన్నారు. బిట్‌‌‌‌‌‌‌‌కనెక్ట్ లెండింగ్ ప్రోగ్రామ్‌‌‌‌‌‌‌‌ ద్వారా సెక్యూరిటీల అమ్మకాలు, రిజిస్ట్రేషన్ లేకుండా టిప్స్ ఇస్తున్న ఓ ఫ్రాడ్‌‌‌‌‌‌‌‌ కేసును ఈడీ అహ్మదాబాద్ ఆఫీస్ దర్యాప్తు చేస్తోంది. ఈ కేసుకు సంబంధించి తాజాగా సోదాలు జరిగాయి.

రూ.13.50 లక్షల క్యాష్‌‌‌‌‌‌‌‌, ఒక ఎస్‌‌‌‌‌‌‌‌యూవీ, క్రిప్టో కరెన్సీలు ఉన్న కొన్ని డిజిటల్ డివైజ్‌‌‌‌‌‌‌‌లను సీజ్ చేశారు. నవంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, 2016 –  జనవరి, 2018 మధ్య ఈ ఫ్రాడ్ జరిగింది. ప్రతీ రోజు ఒక శాతం రిటర్న్‌‌‌‌‌‌‌‌, ఏడాదికి 370 శాతం రిటర్న్‌‌‌‌‌‌‌‌ ఇస్తామని  బిట్‌‌‌‌‌‌‌‌కనెక్ట్ వెబ్‌‌‌‌‌‌‌‌పోర్టల్‌‌‌‌‌‌‌‌లో ప్రమోటర్లు ప్రచారం చేశారు. కానీ, ప్రమోటర్లు ఇన్వెస్టర్ల నుంచి సేకరించిన ఫండ్స్‌‌‌‌‌‌‌‌ను  ట్రేడ్ చేయడానికి కాకుండా తమ అకౌంట్లకు పంపుకున్నారు. ఈ కేసుకు సంబంధించి గతంలో రూ.489 కోట్ల ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది.