శివసేన(ఉద్ధవ్ వర్గం) ఎంపీ అభ్యర్థి అమోల్ కీర్తికర్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సమన్లు జారీ చేసింది. కరోనా సమయంలో వలస కార్మికులకు ఆహారం పంపిణీకి సంబంధించి కాంట్రాక్టుల అప్పగింతలో ఆయన అవకతవకలకు పాల్పడ్డారని ఆరోపించింది.
కాగా.. ఎంపీ అభ్యర్థిగా ప్రకటించిన వెంటనే అతణ్ని భయపెట్టాలనే ప్రయత్నంలో భాగంగానే ఈడీతో నోటీసులు పంపించినట్లు శివసేన నేత సంజయ్ రౌత్ ఆరోపించారు. లోక్‌సభ ఎన్నికల కోసం 16 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను శివసేన (యూబీటీ) బుధవారం విడుదల చేసింది. ఏకనాథ్ షిండే వర్గంలో ఉన్న అమోల్ కీర్తికర్ తండ్రి గజానన్ కీర్తికర్ ముంబై నార్త్-వెస్ట్ నియోజకవర్గం నుండి ప్రస్తుత ఎంపీగా ఉన్నారు