అమెజాన్‌‌‌‌‌‌‌‌, ఫ్లిప్‌‌‌‌‌‌‌‌కార్ట్ ఎగ్జిక్యూటివ్స్‌కు ఈడీ సమన్లు

అమెజాన్‌‌‌‌‌‌‌‌, ఫ్లిప్‌‌‌‌‌‌‌‌కార్ట్ ఎగ్జిక్యూటివ్స్‌కు ఈడీ సమన్లు

న్యూఢిల్లీ: ఫారిన్ ఇన్వెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ చట్టాలను ఉల్లంఘించాయనే కేసులో అమెజాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఫ్లిప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కార్ట్ ఎగ్జిక్యూటివ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లకు  ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫోర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సమన్లు జారీ చేసింది. దర్యాప్తులో వేగం పెంచింది. ఈ రెండు ఈ–కామర్స్ కంపెనీలు కొంతమంది సెల్లర్లకు ఫేవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా పనిచేస్తూ, చట్టాలని ఉల్లంఘించాయని కాంపిటీషన్ కమిషన్ ఆఫ్​ ఇండియా(సీసీఐ) కూడా ఆరోపించిన విషయం తెలిసిందే. 

ఇండియా చట్టాలను అమెజాన్, ఫ్లిప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కార్ట్ ఫాలో అవుతున్నట్టు కనిపిస్తున్నాయి. కానీ,  కొంతమంది సెల్లర్ల ద్వారా గూడ్స్ నిల్వలను కంట్రోల్ చేస్తున్నాయనే ఆరోపణలపై గత కొన్నేళ్లుగా ఈడీ  దర్యాప్తు జరుపుతోంది. కాగా, ఈ–కామర్స్ కంపెనీలు తమ వెబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సైట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అమ్మే వస్తువుల నిల్వలను మేనేజ్ చేయకూడదు. ఇండిపెండెంట్ సెల్లర్లు మాత్రమే గూడ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను నిల్వ చేయడానికి కుదురుతుంది. కిందటి వారం  కొంతమంది అమెజాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఫ్లిప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సెల్లర్ల ఆఫీసుల్లో  ఈడీ దాడులు చేసింది.  ఈ దాడుల్లో దొరికిన డాక్యుమెంట్లను ఈడీ రివ్యూ చేస్తోందని,  దర్యాప్తులో ముందుకెళ్లేందుకు ఈ కంపెనీ ఎగ్జిక్యూటివ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లకు సమన్లు జారీ చేసిందని  సంబంధిత అధికారి పేర్కొన్నారు. గత ఐదేళ్లుగా ఈ  సెల్లర్లు ఈ–కామర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్లాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫామ్స్‌‌తో జరిపిన డీలింగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కూడా ఈడీ రివ్యూ చేస్తోందని అన్నారు.