బీఆర్​ఎస్​ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రెడ్డికి ఈడీ సమన్లు

బీఆర్​ఎస్​ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రెడ్డికి ఈడీ సమన్లు
  • భూదాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  భూముల ఆక్రమణ కేసులో 16న విచారణకు రావాలని ఆదేశం
  • వంశీరామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బిల్డర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఆమోద డెవలపర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కూ నోటీసులు
  • కీలకంగా మారిన ఐఏఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అమోయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కుమార్  స్టేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌
  • భూదాన్‌‌  భూముల ఆక్రమణ కేసులో16న విచారణకు రావాలని ఆదేశం

హైదరాబాద్‌‌, వెలుగు: రంగారెడ్డి జిల్లా భూదాన్‌‌  భూముల కుంభకోణం కేసులో బీఆర్‌‌‌‌ఎస్  మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌‌ రెడ్డికి ఈడీ సమన్లు జారీచేసింది. ఆయనతో పాటు వంశీరామ్  బిల్డర్స్‌‌కు చెందిన బి.సుబ్బారెడ్డి, ఆమోద  డెవలపర్స్‌‌కు చెందిన సూర్య తేజ, కేఎస్‌‌ఆర్‌‌ మైన్స్‌‌కి చెందిన కె.సిద్దారెడ్డికి కూడా గురువారం సమన్లు జారీచేసింది. బషీర్‌‌‌‌బాగ్‌‌లోని ఈడీ కార్యాయంలో ఈ నెల 16 న ఉదయం 10.30 గంటలకు హాజరుకావాలని వారిని ఆదేశించింది. ముగ్గురికి విడివిడిగా సమన్లు పంపింది.

మహేశ్వరం మండలం నాగారంలోని గ్రామ పరిధిలోని 42 ఎకరాల 33 గుంటల భూదాన్  యజ్ఞ  భూములు అన్యాక్రాంతం అయిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఐఏఎస్‌‌  అమోయ్‌‌ కుమార్‌‌‌‌ను గత నెల 23, 24, 25న  అధికారులు ప్రశ్నించారు. భూదాన్‌‌  భూములు, నిషేధిత జాబితాలో ఉన్న భూముల రిజిస్ట్రేషన్లకు చెందిన వివరాలను సేకరించారు. ధరణిలో మార్పులు, ఫోర్జరీ డాక్యుమెంట్లతో రూ.వందల కోట్ల విలువచేసే భూములను రియల్టర్లకు అప్పగించినట్లు ఈడీ గుర్తించింది.

మహేశ్వరం రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్‌‌‌‌ 27లో భారీ రియల్  ఎస్టేట్‌‌  ప్రాజెక్టులు ఏర్పాటు చేసినట్లు గుర్తించింది. ఇందులో మాన్‌‌ హటన్‌‌  పేరుతో రియల్‌‌ ఎస్టేట్‌‌ సంస్థకు అక్రమంగా భూ కేటాయింపులు జరిగినట్లు ఈడీ గుర్తించినట్లు తెలిసింది. అమోయ్‌‌ కుమార్‌‌‌‌ వెల్లడించిన వివరాల ఆధారంగా జనార్దన్‌‌ రెడ్డి సహా వంశీరామ్‌‌  బిల్డర్స్, ఆమోద డెవలపర్లకు సమన్లు జారీ చేసింది.