ఆర్బీఐకి చెప్పకుండానే విదేశాలకు ఫార్ములా రేసింగ్ డబ్బు

ఆర్బీఐకి చెప్పకుండానే విదేశాలకు ఫార్ములా రేసింగ్ డబ్బు

ఫార్ములా ఈ రేసింగ్ కేసులో కేటీఆర్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది.. ఈ వ్యవహారంలో సంచలన అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆర్బీఐకి సమాచారం లేకుండా విదేశాలకురూ. 45.71 కోట్లు  ట్రాన్స్‌‌‌‌ఫర్‌‌‌‌‌‌‌‌ చేసినందు కు హెచ్​ఎండీఏకు ఇన్‌‌‌‌కమ్‌‌‌‌ ట్యాక్స్‌‌‌‌ డిపార్ట్‌‌‌‌ మెంట్‌‌‌‌ రూ.8 కోట్ల 6 లక్షల 75 వేల 404 ఫైన్​ వేసింది.

దీంతోపాటు వివిధ ఫీజుల రూపంలో ఫెడరేషన్​ ఇంటర్నేషనల్​ ఆటోమొబైల్, ఫెడరేషన్ ఆఫ్ మోటార్ స్పోర్ట్స్ క్లబ్స్ ఆఫ్ ఇండియా కు మరో రూ. కోటి 10 లక్షల 51 వేల 14 ను హెచ్‌‌‌‌ఎండీఏ చెల్లించింది. ఇట్ల ఫార్ములా ఈ రేస్​ సీజన్ 10​ కోసం మొత్తంగా రూ.54 కోట్ల 88 లక్షల 87 వేల 43ను హెచ్‌‌‌‌ఎండీఏ చెల్లింపు లు జరిపింది.

Also Read:-ఎన్నికల కోడ్ ఉన్నప్పుడే.. ఫార్ములా ఈ రేసింగ్ అగ్రిమెంట్.. లండన్ కు డబ్బు తరలింపు

హెచ్‌‌‌‌ఎండీఏ రూల్స్​ ప్రకారం రూ. 10 కోట్ల కంటే ఎక్కువ చెల్లింపులు చేయాలంటే ప్రభు త్వం, ఆర్థిక శాఖ అనుమతి తప్పనిసరి. కానీ.. నాడు ఈ నిబంధనలేవీ పట్టించుకోలేదు.