జుట్టుంటే ఎన్ని హొయలైనా పోవచ్చు అన్న సామెత మనం తరచూ వింటూనే ఉంటాం. జుట్టు వల్ల అందం, ఆత్మ స్తైర్యం పెరగటమే కాదు, కోటాను కోట్ల ఆదాయం కూడా వస్తుంది. హైదరాబాద్ లో ఒక మనీ లాండరింగ్ కేసులో వెలుగులోకి వచ్చిన కేసుఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. హైదరాబాద్ కి చెందిన నైలా ఫ్యామిలీ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ సంస్థ మీద జరిపిన మనీ లాండరింగ్ కేసు విచారణలో 11వేల కోట్ల విలువచేసే జుట్టు రాకెట్ వెలుగులోకి వచ్చింది.
హైదరాబాద్, మిజోరాం, మయన్మార్ వేదికగా నడుస్తున్న ఈ రాకెట్ ను ఈడీ గుర్తించింది. షెల్ కంపెనీల ద్వారా నకిలీ ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ కోడ్ ( IEC ) ని సృష్టించి అక్రమ రవాణాకు పాల్పడుతున్నట్లు ఈడీ తెలిపింది. జుట్టు రాలే సమస్య ఎక్కువగా ఉన్న చైనా, మయన్మార్, బాంగ్లాదేశ్, వియత్నామ్ వంటి దేశాలకు ఈ ఎగుమతులు జరుగుతున్నాయని ఈడీ తెలిపింది. ఒకవేళ ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు షెల్ కంపెనీలను గుర్తిస్తే, వాటిని రద్దు చేసి కొత్త IECలను క్రియేట్ చేసి ఈ రాకెట్ ను కంసాగిస్తున్నట్లు గుర్తించారు అధికారులు. ఈ రాకెట్ ద్వారా మొత్తం 11వేల కోట్లకు పైగా లావాదేవీలు జరిగాయని, సుమారు 2వేలకోట్ల వరకు వివిధ మార్గాల్లో వేర్వేరు అకౌంట్లకు డబ్బులు ట్రాన్స్ఫర్ అయ్యిందని అధికారులు తెలిపారు.