
ఎడపల్లి, వెలుగు : మండలంలోని బషీర్ ఫారం రైల్వే గేటును ఈ నెల 6 నుంచి మూసి వేస్తున్నట్లు శుక్రవారం ఎడపల్లి పోలీస్ స్టేషన్లో నోటీసు అందజేసినట్లు సికింద్రాబాద్ డివిజన్ రైల్వే ఇంజినీర్ తెలిపారు. రైల్వే గేటు వద్ద అండర్ పాస్ నిర్మిస్తున్నందున గేటు మూసివేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రయాణానికి ఇబ్బంది అవుతుందని ఇదివరకు పోచారం గ్రామస్తులు తీవ్రంగా వ్యతి రేకించగా, గేటు మూసివేతను విరమించారు. మళ్లీ అండర్ పాస్ నిర్మాణం పేరుతో మార్గాన్ని మూసివేస్తున్నారు.