అన్నాడీఎంకే తాత్కాలిక అధ్యక్షుడు పళనిస్వామికి పార్టీ కార్యాలయం దగ్గర ఘనస్వాగతం లభించింది. చెన్నైలోని అన్నా డీఎంకే ఆఫీస్ కు పళనిస్వామి వెళ్లారు. జనరల్ కౌన్సిల్ సమావేశంలో తాత్కాలిక అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత తొలిసారిగా పార్టీ కార్యాలయానికి వెళ్లారు. కార్యాలయం దగ్గర పళని స్వామి వర్గానికి చెందిన వారు పెద్దఎత్తున సెలబ్రేషన్స్ చేశారు. పార్టీ ఆఫీస్ దగ్గరున్న జయలలిత, ఎంజీఆర్ విగ్రహాలకు పళనిస్వామి పులమాలలు వేసి నివాళులర్పించారు.
జనరల్ కౌన్సిల్ మీటింగ్ టైంలో పళనిస్వామి, పన్నీర్ సెల్వం వర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. దీంతో పార్టీ ఆఫీస్ డోర్లు పగులగొట్టి కొన్ని డాక్యుమెంట్లు ఎత్తుకెళ్లారు పన్నీర్ సెల్వం వర్గానికి చెందిన వారు. దాని తర్వాత పార్టీ అధినాయకత్వంపై కోర్టులో విచారణ జరిగింది. చివరకు పార్టీ పగ్గాలు పళనిస్వామి చేతికొచ్చాయి. ఘర్షణ తర్వాత నుంచి పార్టీ కార్యాలయాన్ని మూసేశారు. కొన్ని నెలల తర్వాత ఇవాళ పార్టీ కార్యాలయాన్ని తెరిచారు. దీంతో భారీ ఎత్తున కార్యకర్తలు తరలివచ్చారు.
#WATCH | Tamil Nadu: AIADMK interim general secretary Edappadi K Palaniswami arrives at party HQ in Chennai, amid celebrations and a huge gathering of supporters, for the first time since the party's General Council Meeting. pic.twitter.com/ub9mUcR0hu
— ANI (@ANI) September 8, 2022