కాంగ్రెస్​లో చేరిన ఎడవల్లి కృష్ణ

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : జిల్లాకు చెందిన సీనియర్​ లీడర్​ఎడవల్లి కృష్ణతో పాటు పలువురు నాయకులు సొంతగూటికి చేరుకున్నారు. చేరికల కమిటీ చైర్మన్​ జగ్గారెడ్డి ఆధ్వర్యంలో హైదరాబాద్​లోని గాంధీ భవన్​లో శుక్రవారం జిల్లాలోని పలువురు నాయకులు బీఆర్​ఎస్​ ను వీడి కాంగ్రెస్​లో చేరారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు టీపీసీసీ జనరల్​ సెక్రటరీగా ఉన్న ఎడవల్లి కృష్ణతో పాటు పలువురు కాంగ్రెస్​ నాయకులు బీఆర్​ఎస్​లో చేరగా, వారంతా లోక్​ సభ ఎన్నికల ముందు మళ్లీ కాంగ్రెస్​లో కి వచ్చారు. పార్టీలో చేరినవారిలో రాయల శాంతయ్య, మల్లికార్జున్​, వీరయ్య చౌదరి, పల్లపు వెంకట్, బీ. శ్రీనివాస్, బీఎన్​ చారితో పాటు కొత్తగూడెం, పాల్వంచ పట్టణాలకు చెందిన పలువురు నాయకులు ఉన్నారు.