దత్తాయపల్లి పాల సంఘం చైర్మన్ ఎన్నిక

దత్తాయపల్లి పాల సంఘం చైర్మన్ ఎన్నిక

యాదగిరిగుట్ట, వెలుగు : తుర్కపల్లి మండలం దత్తాయపల్లి పాల సంఘం చైర్మన్ గా బీఆర్ఎస్ కు చెందిన ఎద్దు నర్సింహులు ఎన్నికయ్యారు. నూతన డైరెక్టర్లుగా గిద్దె సుధాకర్, గుంటి ఆంజనేయులను కూడా ఎన్నుకున్నారు. చైర్మన్ పీఠం కోసం కాంగ్రెస్, బీఆర్ఎస్ కు చెందిన నాయకులు పోటీ పడగా.. బీఆర్ఎస్ తరఫున పోటీ చేసిన ఎద్దు నర్సింహులు గెలుపొందారు. మంగళవారం నిర్వహించిన ఎన్నికల్లో మొత్తం 10 డైరెక్టర్లకు ఆరుగురు డైరెక్టర్లు ఎద్దు నర్సింహులుకు మద్దతు తెలిపారు.

దీంతో ఎలక్షన్ ఆఫీసర్ మెజార్టీ ఓట్లు పొందిన నర్సింహులును చైర్మన్ గా ప్రకటించారు. అనంతరం నూతన చైర్మన్ ను డైరెక్టర్లు, బీఆర్ఎస్ నాయకులు శాలువాలతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.