నిద్రపోయిన అంపైర్లు.. అరుదైన ఘనత సొంతం చేసుకున్న మహిళా క్రికెటర్

నిద్రపోయిన అంపైర్లు.. అరుదైన ఘనత సొంతం చేసుకున్న మహిళా క్రికెటర్

పరిమిత ఓవర్ల క్రికెటైన వన్డే ఫార్మాట్‌లో ఒక్కో బౌలర్ 10 ఓవర్లు మాత్రమే వేయగలరు. ఈ విషయం క్రికెట్ పరిజ్ఞానం ఉన్న ప్రతి ఒక్కరికీ తెలుసు. మొత్తం 50 ఓవర్ల పాటు సాగే ఒక ఇన్నింగ్స్‌లో.. 10 ఓవర్ల చొప్పున బౌలింగ్ చేసేందుకు ఐదుగురు బౌలర్లకు అనుమతిస్తారు. అంటే.. ఒక బౌలర్ గరిష్టంగా 10 ఓవర్లు బౌలింగ్ వేయవచ్చు. కానీ, ఓ అంతర్జాతీయ మ్యాచ్‌లో అంపైర్లు చేసిన తప్పిదం కారణంగా.. ఓ మహిళా క్రికెటర్ 11వ ఓవర్లు పూర్తి చేసి అరుదైన రికార్డు తనపేరిట లిఖించుకుంది. 

శుక్రవారం గాలే వేదికగా న్యూజిలాండ్, శ్రీలంక మహిళల జట్ల మధ్య రెండో వన్డే జరిగింది. ఈ మ్యాచ్‌లో కివీస్ మహిళా బౌలర్ ఈడెన్ కార్సన్ 11 ఓవర్లు బౌలింగ్ చేసింది. అప్పటికే తన 10 ఓవర్ల కోటా పూర్తి చేసుకున్న కార్సన్.. మరోసారి కెప్టెన్ బాల్ అందించగానే చకచకా మరో ఓవర్ పూర్తి చేసింది. చివరకు మ్యాచ్ ముగిశాక అంపైర్లు.. ఈ విషయాన్ని పసిగట్టారు. కానీ ఏం లాభం.. అప్పటికే అంతా జరిగిపోయింది.

చివరిసారిగా వన్డే క్రికెట్‌లో.. అధికారికంగా ఓ బౌలర్ 11 ఓవర్లు వేసిన సందర్భం 1995లో జరిగింది. అప్పట్లో వన్డే మ్యాచ్ అంటే.. 55 ఓవర్లు నిర్వహించేవారు. అందువల్లే 11 ఓవర్లు వేసేందుకు అనుమతించేవారు. ఏదేమైనా అంపైర్ల నిద్రమత్తు వల్ల.. ఓ బౌలర్ అరుదైన రికార్డు మూటగట్టుకున్నందుకు అభినందించాల్సిందే. అయితే ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతుండటం అంపైర్ల అసమర్థతను ప్రశ్నిస్తోంది. 1995 తరువాత ఇలా జరగటం ఇది ఐదోసారి.

11 overs for a bowler in a 50-over match? ?

New Zealand's Eden Carson did that due to an oversight in the second #SLvNZ ODI!

Since the last 55-overs-a-side match in ODIs in 1995, there have been five instances (across men's and women's games) where a bowler has bowled beyond… pic.twitter.com/capOHd8Zfv

— ESPNcricinfo (@ESPNcricinfo) July 1, 2023