న్యూఢిల్లీ: కస్టమర్లకు ఊరట కలిగించేలా పెద్ద కంపెనీలన్నీ వంట నూనెల రేట్లను 10–15 శాతం తగ్గించినట్లు సాల్వెంట్ ఎక్స్‌ట్రాక్టర్స్ అసోసియేషన్ (ఎస్ఈఏ) సోమవారం తెలిపింది. అదానీ విల్మార్, రుచి సోయా సహా పెద్ద కంపెనీలన్నీ తమ మాగ్జిమమ్ రిటెయిల్ ప్రైస్ (ఎంఆర్పీ) ని తగ్గించాయని పేర్కొంది. ఇమామి, బుంగె, జెమిని, కోఫ్కో, ఫ్రిగోరిఫికో అల్లన, గోకుల్ ఆగ్రో కంపెనీలూ రేట్లను తగ్గించిన కంపెనీలలో ఉన్నాయని వెల్లడించింది. రేట్లు తగ్గించాలనే తమ ప్రపోజల్‌పై లీడింగ్ మెంబర్లందరూ సానుకూలంగా స్పందించడం సంతోషం కలిగిస్తోందని ఎస్ఈఏ ఈ స్టేట్మెంట్లో పేర్కొంది. ఇంపోర్ట్ డ్యూటీలను తగ్గించిన నేపథ్యంలో సానుకూలంగా వ్యవహరించి, వంట నూనెల రేట్లు తగ్గించాలని కంపెనీలను ఫుడ్ సెక్రటరీ సుధాంశు పాండే కోరిన విషయం తెలిసిందే. కొత్త సంవత్సరంలో ఆవాల పంట రానుండటంతోపాటు, గ్లోబల్గానూ రేట్లు దిగి వచ్చే సూచనలున్నాయని ఎస్ఈఏ తెలిపింది. గ్లోబల్‌గా రేట్లు ఎక్కువగా ఉండటంతో వంట నూనెల రేట్లు దేశీయంగానూ పెరిగాయని, ధరలను కిందకి తెచ్చేందుకు రిఫైన్డ్, క్రూడ్ ఎడిబుల్ ఆయిల్స్‌పై ఇంపోర్ట్ డ్యూటీలను ప్రభుత్వం తగ్గించిన విషయం తెలిసిందే.
తగ్గిన వంటనూనెల ధరలు
- బిజినెస్
- December 28, 2021
లేటెస్ట్
- ఖమ్మం జిల్లా : వేంసూరు.. సత్తుపల్లి మండలాల గ్రామ సభల్లో ఉద్రిక్తం
- హైదరాబాద్‌లో రైల్వే పట్టాలపై ఓయూ విద్యార్థిని ఆత్మహత్య
- Vinayakan Viral Video: ఇంత గలీజు పనులేంట్రా : జైలర్ మూవీ విలన్ అరాచకాలు మామూలుగా లేవుగా..
- కరీంనగర్ జిల్లా : చాకలివనిపల్లె గందరగోళం..గ్రామ సభలో మహిళ కన్నీరు పెట్టింది
- IND vs ENG: ఇంగ్లాండ్ వికెట్ కీపర్ బట్లర్ కాదు.. కన్ఫర్మ్ చేసిన హెడ్ కోచ్ మెకల్లమ్
- నక్సలిజానికి చివరి రోజులు : అమిత్ షా సంచలన ట్విట్
- భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: పాల్వంచ మున్సిపాల్టీలో గ్రామసభలు
- WHOకు గుడ్ బై.. వర్క్ ఫ్రం హోం రద్దు.. అమెరికాలో పుడితే పౌరసత్వం ఇవ్వరు : ట్రంప్ సంచలన నిర్ణయాలు
- Emergency OTT: ఓటీటీలోకి కంగనా పొలిటికల్ డ్రామా ‘ఎమర్జెన్సీ’.. ఏ ప్లాట్ఫామ్లో రానుందంటే?
- సంజయ్ రాయ్ కు జీవించే హక్కు లేదు: ఉస్మానియా మెడికోస్ ఆర్గనైజేషన్
Most Read News
- హైదరాబాద్.. విజయవాడ మధ్య కొత్త రైలు: నో రిజర్వేషన్.. అన్నీ జనరల్ బోగీలే.. టైమింగ్స్ ఇలా..
- మీ SBI సేవింగ్ అకౌంట్ నుంచి రూ.236 కట్ అవుతున్నాయా..? కారణం ఇదే..!
- తిరుమల అన్నప్రసాదంలో మార్పులు.. టీటీడీ కీలక నిర్ణయం
- రేషన్‌కార్డుల లిస్టులో పేరు లేదా ? .. జనవరి 21 నుంచి మళ్లీ అప్లై చేస్కోండి
- Good Food : ఈ ఆకుకూరల చట్నీలు.. రోజూ తింటే నొప్పులు మాయం.. చెడు కొలస్ట్రాల్ ను ఇట్టే తగ్గిస్తుంది..!
- Champions Trophy 2025: భారత జట్టులో ఆ ముగ్గురే మ్యాచ్ విన్నర్లు.. వారి ఆట చూడొచ్చు: పాక్ ఓపెనర్
- చేతికి పతంగ్.. కారులో కమలం..! తెలంగాణలో మారుతోన్న పొలిటికల్ ఈక్వేషన్స్
- నాలుగు స్కీములకు ఇయ్యాల్టి నుంచి అప్లికేషన్లు
- IND vs ENG: నా ఆట అంతే అంటే కుదరదు.. ఇకనైనా పంత్ మారాలి: సురేష్ రైనా
- 8ఏళ్ళ బాలుడికి గుండెపోటు.. భయపెట్టాలనుకుంటే.. ఏకంగా ప్రాణమే పోయింది..