నవంబర్ 18  నుంచి టెట్ అప్లికేషన్లకు ఎడిట్ ఆప్షన్

హైదరాబాద్, వెలుగు: టీచర్  ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) కు భారీగా దరఖాస్తులు వస్తున్నాయి. సుమారు లక్షన్నర మంది అప్లై చేశారు. సోమవారం  నుంచి ఈనెల 22 వరకూ అప్లికేషన్లలో తప్పులు వస్తే ఎడిట్  చేసుకునే అవకాశాన్ని అధికారులు కల్పించారు. స్కూల్ ఎడ్యుకేషన్ వెబ్ సైట్​లో అప్లికేషన్  ఉంటుందని ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. దరఖాస్తు సమయంలో ఏమైనా టెక్నికల్ సమస్యలు వస్తే  70329 01383/ 90007 56178 నంబర్లకు వర్కింగ్ డేస్ లో కాల్ చేయాలని సూచించారు. కాగా, ఈనెల 20 వరకూ టెట్ కు అప్లై చేసుకునేందుకు అవకాశం ఉంది