
ఇన్స్టాగ్రామ్ ఎడిట్స్ యాప్ ద్వారా హైక్వాలిటీ వీడియోలను క్రియేట్ చేయొచ్చు. ఇప్పుడు ఈ యాప్ అందరికీ అందుబాటులోకి వచ్చేసింది. దీంతో వీడియో ఎడిట్ చేయడానికి ఈ యాప్ నుంచి వేరే యాప్‌కి వెళ్లనవసరం లేదు. అంటే వీడియోకి అవసరమైన టూల్స్ అన్నీ ఒకే యాప్‌లో ఉంటాయి. కాబట్టి మీ ఐడియాలను కూడా సేవ్ చేసుకోవచ్చు. ప్రాజెక్ట్‌లను కూడా మేనేజ్ చేయొచ్చు.
ఇతర యాప్‌లకు మారకుండానే వాటర్‌మార్క్‌లు లేకుండా వాటిని ఈజీగా ఎక్స్పోర్ట్ చేయొచ్చు. క్వాలిటీ కెమెరా, ఫ్రేమ్ ఫిక్స్డ్ టైమ్‌లైన్, కటౌట్, ఏఐ యానిమేషన్ వంటివి వాడి వీడియో క్రియేట్ చేయొచ్చు. ట్రెండింగ్ సాంగ్స్, పాపులర్ ఫీడ్ ఎలాగూ అందుబాటులో ఉంటాయి. కాబట్టి వాటిని చూసి మీ కంటెంట్‌ని ఎలా మెరుగుపరుచుకోవాలో తెలుసుకోవచ్చు. ఈ యాప్ వాడాలంటే.. ముందుగా గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఎడిట్స్ బై ఇన్‌స్టాగ్రామ్‌ని డౌన్లోడ్ చేసుకోవాలి. తర్వాత మీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్‌తో సైన్ ఇన్ చేయాలి.