
తెలంగాణ రాష్ట్రంలో బీఈడీ కోర్సులో అడ్మిషన్స్‌కు సంబంధించి టీఎస్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్(ఎడ్‌సెట్) 2024 నోటిఫికేషన్‌ను తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ విడుదల చేసింది. ఈ ఏడాది పరీక్షను నల్గొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ నిర్వహిస్తోంది.
దరఖాస్తు ప్రక్రియ మార్చి 6 నుంచి మే 6 వరకు కొనసాగుతుంది. ఆసక్తికలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులైన వారు దరఖాస్తు చేసుకోవచ్చు.
అర్హతలు : గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి. ప్రస్తుతం చివరి సంవత్సరం చదువుతున్న వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు డిగ్రీ స్థాయిలో చదివిన సబ్జెక్ట్‌లనే ఎడ్‌సెట్‌లో మెథడాలజీ సబ్జెక్ట్‌లుగా ఎంచుకోవాల్సి ఉంటుంది.
దరఖాస్తులు : అభ్యర్థులు ఆన్‌లైన్‌లో మే 6 వరకు దరఖాస్తు చేసుకోవాలి. మే 23న పరీక్ష నిర్వహిస్తారు. వివరాలకు www.edcet.tsche.ac.in వెబ్సైట్లో సంప్రదించాలి.