
హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్‌కు చెందిన మ్యాథ్ -లెర్నింగ్ ఎడ్‌టెక్ స్టార్టప్ భాంజు.. ఎపిక్ క్యాపిటల్ నేతృత్వంలో సిరీస్ బీ ఫండింగ్ రౌండ్‌లో జెడ్3 వెంచర్స్ నుంచి 16.5 మిలియన్ డాలర్లను సేకరించింది. రాబోయే ఐదేళ్లలో 10 కోట్ల మంది విద్యార్థులను చేరుకోవడానికి ఈ పెట్టుబడి సహాయం చేస్తుందని ఫౌండర్ నీలకంఠ చెప్పారు. అధునాతన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి ప్రతి విద్యార్థి వేగం, అవసరాలకు అనుగుణంగా పాఠాలను మార్చడం తమ ప్రత్యేకత అని ఆయన వివరించారు.