-కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్‌పోఖ్రియాల్ నిశాంక్
వర్చువల్ ఆన్లైన్ మోడ్‌లో వరంగల్ నిట్ 18వ కాన్వొకేషన్
కాజీపేట, వెలుగు: చదువు అనేది స్టూడెంట్ల జీవితంతోపాటు సమాజాన్ని మార్చే ఆయుధమని కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్నిశాంక్ అన్నారు. వరంగల్‌లోని నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(నిట్) 18వ స్నాతకోత్సవాన్ని గురువారం ఆన్లైన్లో నిర్వహించారు. అంతకుముందు ఎన్ఐటీలో కొత్తగా నిర్మించిన పండిట్ మదన్మోహన్ మాలవ్య టీచింగ్ సెంటర్, విశ్వేశ్వరయ్య స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, సర్దార్ వల్లభాయ్ పటేల్ గెస్ట్ హౌస్‌ను కేంద్ర విద్యాశాఖ మంత్రి ఆన్లైన్ ద్వారా ప్రారంభించారు. నిట్ డైరెక్టర్ ఎన్వీ రమణారావు మాట్లాడుతూ కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ వెల్లడించిన ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్‌లో వరంగల్ నిట్ 19వ స్థానంలో ఉందని చెప్పారు. వివిధ ఏజెన్సీల నుంచి 41 కోట్ల విలువైన 137 పరిశోధన ప్రాజెక్టులు ఈ సంస్థకు మంజూరయ్యాయని చెప్పారు. స్నాతకోత్సవంలో 1,607 మందికి సర్టిఫికెట్లను ఆన్ లైన్లో నిట్ డైరెక్టర్, డీన్ లు ప్రదానం చేశారు. బీటెక్ కెమికల్ ఇంజినీరింగ్ స్టూడెంట్ అపూర్వ భరద్వాజ్ ఇంజినీరింగ్ బ్రాంచిలో అత్యధిక సీజీపీఏ సాధించి నిట్ టాపర్ గా గోల్డ్ మెడల్ తీసుకున్నారు.