- మధ్యాహ్న భోజన చార్జీల పెంపుపై ప్రభుత్వానికి ప్రపోజల్స్ పంపిస్తాం
కూసుమంచి, వెలుగు : ప్రస్తుత పరిస్థితిలో 8, 9వ తరగతులు చదువుతున్న స్టూడెంట్లు సైతం చూసి చదవలేని స్థితిలో ఉన్నారని విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి అన్నారు. ఖమ్మం జిల్లాలోని కూసుమంచి, జీళ్లచెరువు హైస్కూల్స్‌ను సోమవారం ఆయన సందర్శించారు. ముందుగా క్లాస్ రూమ్స్, ఆహార పదార్థాలను పరిశీలించారు. జీళ్లచెరువు హైస్కూల్‌లో పిల్లలతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మధ్యాహ్న భోజన ఛార్జీలు పెంచాల్సి ఉందని, ఈ విషయంపై ప్రభుత్వానికి ప్రపోజల్స్ పంపుతామన్నారు.
పలు దేశాలు, రాష్ట్రాల్లో విద్యావిధానంపై అధ్యయనం చేశామని, వాటిని ఇక్కడ అమలు చేస్తేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. టెస్త్ క్లాస్‌లో సెమిస్టర్ విధానం అమలు చేస్తే ఎలా ఉంటుందన్న విషయంపై ఆలోచన చేస్తున్నామన్నారు. స్కూళ్ల పర్యటనలో గమనించిన అంశాలతో ప్రభుత్వానికి రిపోర్ట్ అందజేస్తామన్నారు. ఆయన వెంట డీఈవో సోమశేఖర్ శర్మ, బీసీ వేల్పేర్ డీడీ జ్యోతి, సోషల్ వెల్ఫేర్ డీడీ కస్తాల సత్యనారాయణ, మైనార్టీ వెల్ఫేర్ డీడీ విజయలక్ష్మి, ఎంఈవో వీరస్వామి పాల్గొన్నారు.