హాస్టల్స్‌‌‌‌లో సౌకర్యాల కల్పనకు ఎస్‌‌‌‌వోపీ

  • స్టూడెంట్లకు క్వాలిటీ ఫుడ్‌‌‌‌ అందించడంపై సీఎం ఫోకస్‌‌‌‌
  • విద్యా కమిషన్‌‌‌‌ చైర్మన్‌‌‌‌ ఆకునూరి మురళి

భద్రాద్రికొత్తగూడెం/మణుగూరు వెలుగు : హాస్టళ్లు, గురుకులాలు, ఆశ్రమ స్కూళ్లు, కస్తూర్బాలో క్వాలిటీ భోజనంతో పాటు సౌకర్యాలు కల్పించేందుకు స్టాండర్ట్‌‌‌‌ ఆపరేటివ్‌‌‌‌ ప్రొసీజర్‌‌‌‌ (ఎస్‌‌‌‌వోపీ) రూపకల్పనకు కృషి చేస్తున్నామని విద్యా కమిషన్‌‌‌‌ చైర్మన్‌‌‌‌ ఆకునూరి మురళి చెప్పారు. ఇందుకోసం సీఎం రేవంత్‌‌‌‌రెడ్డి స్పెషల్‌‌‌‌ ఫోకస్‌‌‌‌ పెట్టారన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పినపాక, అశ్వాపురం, మణుగూరు మండలాల్లో పర్యటించి స్కూళ్లు, ఆశ్రమ పాఠశాలలను తనిఖీ చేశారు. 

ఈ సందర్భంగా ఆయన ఆట్లాడుతూ హాస్టళ్లలో నాణ్యమైన భోజనం విషయంలో సోషల్‌‌‌‌ ఆడిట్‌‌‌‌ జరగాల్సి ఉందన్నారు. స్టూడెంట్లకు క్వాలిటీ ఫుడ్‌‌‌‌ అందించడం కోసం అవసరమైన రిపోర్ట్‌‌‌‌ రెడీ చేయాలని సీఎం సూచించడం వల్లే అన్ని జిల్లాల్లో పర్యటిస్తున్నామని చెప్పారు. మధ్యాహ్న భోజన స్కీమ్‌‌‌‌లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యం కారణంగా కొంత ఇబ్బంది కలుగుతోందన్నారు. ఇంగ్లీష్‌‌‌‌ మీడియాన్ని ప్రోత్సహించాలని, ఆ దిశగా విద్యార్థులకు అవగాహన కల్పించాలని టీచర్లకు సూచించారు.