ప్రైమరీ నుంచే టెక్నికల్ ఎడ్యుకేషన్ ...విద్యావ్యవస్థలో సమూల మార్పులు:   ఆకునూరి మురళి  

ప్రైమరీ నుంచే టెక్నికల్ ఎడ్యుకేషన్ ...విద్యావ్యవస్థలో సమూల మార్పులు:   ఆకునూరి మురళి  

కొడంగల్, వెలుగు: సమూల మార్పులు తీసుకొచ్చి విద్యావ్యవస్థను పటిష్టం చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని విద్యా కమిషన్​ చైర్మన్ ​ఆకునూరి మురళి తెలిపారు. ప్రభుత్వ స్కూళ్లలో సౌలతుల కల్పనపై ప్రత్యేకంగా దృష్టి పెట్టిందని చెప్పారు. మంగళవారం వికారాబాద్​కలెక్టర్​ప్రతీక్​జైన్​తో కలిసి కొడంగల్​లోని జిల్లా పరిషత్ ​స్కూల్స్(బాయ్స్​అండ్​గర్ల్స్​)​ను ఆకునూరి మురళి పరిశీలించారు.

ఈ సందర్భంగా స్టూడెంట్స్​ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రైమరీ నుంచి హైస్కూల్​వరకు నాణ్యమైన విద్యను అందించేందుకు అవసరమైన పాలసీ తయారు చేసేందుకు విద్యా కమిషన్ ​కృషి చేస్తుందని చెప్పారు. ‘‘సర్కార్ బడుల్లో బోధన విషయంలో సరికొత్త విధానంతో ముందుకెళ్లాలని ప్రభుత్వం భావిస్తున్నది. ఉన్నత విద్యలో నాణ్యత ప్రమాణాలు పెంచి.. ప్రైమరీ నుంచే టెక్నికల్​ఎడ్యుకేషన్​ప్రవేశపెట్టే ఆలోచనలో ప్రభుత్వం ఉంది” అని చెప్పారు.