హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీ సమస్యలపై పూర్తి నివేదిక తీసుకున్నామని.. క్యాంపస్‌కు పూర్వ వైభవం వచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేస్తామని విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళీ తెలిపారు. ఓయూ అధికారులతో సమావేశం అనంతరం ఆయన మాట్లాడారు. ‘ఉస్మానియా యూనివర్సిటీ.. వాటి అనుబంధ కాలేజీలు అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాయి. ఓయూని గత పాలకులు పట్టించుకోలేదు. 80 శాతం అధ్యాపకుల పోస్టులు ఖాళీ ఉన్నాయి. నిధుల కొరత ఉంది. అధికారులు ఇచ్చిన నివేదికపై ప్రభుత్వంతో చర్చిస్త’ అని తెలిపారు.
ALSO READ | అమెరికాలో ఇండియన్స్ పరిస్థితి ఇదే.. ఉద్యోగం ఊడితే తట్టా బుట్టా సర్దుకోవాల్సిందే!