- ఏఐసీటీఈ, యూజీసీ చైర్మన్లకు టీజీసీహెచ్ఈ వినతి
హైదరాబాద్, వెలుగు: ఇంజినీరింగ్ విద్యలో క్వాలిటీ పెంపునకు సహకరించాలని హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి కోరారు. ఢిల్లీలో యూజీసీ చైర్మన్ జగదీశ్ కుమార్, ఏఐసీటీఈ చైర్మన్ టీజీ సీతారామ్ ను కౌన్సిల్ సెక్రటరీ శ్రీరామ్ వెంకటేశ్‌తో పాటు లింబాద్రి కలిశారు. తెలంగాణలో ఏటా లక్ష మందికి పైగా విద్యార్థులు ఇంజినీరింగ్ విద్యలో అడ్మిషన్లు తీసుకుంటున్నారని తెలిపారు.
కానీ వారిలో కేవలం 20 శాతం మాత్రమే క్వాలిటీతో బయటకు వస్తున్నారని చెప్పారు. ఇండ్రస్టీ రిక్వైర్‌మెంట్‌కు అనుగుణంగా క్వాలిటీ పెంచేలా తమకు సహకరించాలని కోరారు. అడిషనల్ సీట్ల కోసం ప్రతిపాదనలకు ఏఐసీటీఈ అనుమతులు ఇస్తుందని, దీనివల్ల రాష్ట్రంలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పారు.
పీహెచ్డీ అడ్మిషన్ల ప్రక్రియలోని సమస్యలతో పాటు బార్ కౌన్సిల్ వద్ద పెండింగ్ లో ఉన్న మూడు లా కాలేజీల అంశాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుపోయారు. త్వరలోనే ఇంజినీరింగ్ ఎడ్యుకేషన్‌పై, ఉపాధి అవకాశాలపై ప్రిన్సిపల్స్, ప్రొఫెసర్లతో ఏర్పాటు చేసే సమావేశానికి రావాలని యూజీసీ, ఏఐసీటీఈ చైర్మను ఆహ్వానించగా వారు సానుకూలంగా స్పందించారు.