సమస్యలు పరిష్కరించాలని మంత్రికి వినతి : సత్యనారాయణ

కామారెడ్డి టౌన్, వెలుగు: విద్యాశాఖలో పని చేస్తున్న సమగ్ర శిక్ష ఉద్యోగులు తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ  శుక్రవారం హైదరాబాద్​లో మంత్రి సబితా ఇంద్రారెడ్డిని కలిసి విన్నవించారు. ఉద్యోగాలను రెగ్యులరైజ్​ చేయాలని,  జీతాలుపెంచాలని కోరారు. మంత్రిని కలిసిన వారిలో జిల్లా ప్రెసిడెంట్​సత్యనారాయణ, ప్రతినిధులు రాములు, సంతోష్​రెడ్డి,  రాజశేఖర్, సూర్యపాల్ ఉన్నారు.