- ఇవ్వాల, రేపు అవకాశం కల్పించిన విద్యాశాఖ
హైదరాబాద్, వెలుగు:టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టీజీ టెట్) మార్కుల సవరణకు విద్యాశాఖ అవకాశం ఇచ్చింది. ఈ నెల12,13 తేదీల్లో https://schooledu.telangana. gov.in/ISMS వెబ్ సైట్ ద్వారా టెట్ వివరాలను సవరించుకునేందుకు చాన్స్ ఇచ్చినట్టు స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఈవీ నర్సింహారెడ్డి ప్రకటనలో తెలిపారు. హాల్ టికెట్ నెంబర్, మార్కుల్లో ఏమైనా మార్పులుంటే చేసుకోవాలని సూచించారు. డీఎస్సీ 2024 అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ నెల 13 తర్వాత టెట్ వివరాల్లో మార్పులకు అవకాశం ఇవ్వబోమని స్పష్టం చేశారు.