టెట్ సిలబస్, గైడ్‎లైన్స్‎ ప్రకటించిన విద్యాశాఖ

టెట్ సిలబస్, గైడ్‎లైన్స్‎ ప్రకటించిన విద్యాశాఖ

టీచర్ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థుల కోసం తెలంగాణ ప్రభుత్వం గురువారం టెట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నెల 26 నుంచి దరఖాస్తుల స్వీకరణ మొదలుపెట్టి.. ఏప్రిల్ 11ను దరఖాస్తుకు చివరి తేదీగా గడువు విధించారు. జూన్ 12న ఉదయం పేపర్ 1 పరీక్ష 9.30 గంటల నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం పేపర్ 2 పరీక్ష 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించనున్నారు. అనంతరం జూన్ 27న ఫలితాలను వెల్లడించనున్నట్లు విద్యాశాఖ తెలిపింది.

కాగా.. టెట్‎కు సంబంధించిన సిలబస్, గైడ్‎లైన్స్‎ను విద్యాశాఖ తమ వెబ్‎సైట్ tstet.cgg.gov.in‎లో పొందుపరిచింది. టెట్ రాసే అభ్యర్థులకు కావలసిన పూర్తి సమాచారం అక్కడ లభించనుంది. ఒక్కో పేపర్‎కు ఫీజు రూ. 300లుగా నిర్దారించారు. రెండు పేపర్లు రాయాలంటే రూ. 600 ఫీజు చెల్లించాల్సిందిగా సూచించారు. అభ్యర్థుల సందేహాల నివృత్తి కోసం హెల్స్ డెస్క్ ను కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ హెల్స్ డెస్క్ నెంబర్లు అన్ని పనిదినాలలో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు అందుబాటులో ఉంటాయని విద్యాశాఖ తెలిపింది. అభ్యర్థుల క్వాలిఫైయింగ్ మార్కులను కూడా ప్రకటించింది. జనరల్ అభ్యర్థులకు 60 శాతం, బీసీలకు 50 శాతం, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 40 శాతం మార్కులు రావాలని తెలిపింది. ఒక్కసారి టెట్‎లో క్వాలిఫై అయితే.. ఆ వ్యాలిడిటీ లైఫ్ లాంగ్ ఉంటుందని చెప్పింది. ఇకపోతే సిలబస్ విషయానికొస్తే.. ఏ సబ్జెక్ట్ నుంచి ఎన్ని మార్కులు వస్తాయో కూడా వివరంగా తెలిపింది. రెండున్నర గంటల పాటు నిర్వహించే ఈ పరీక్షను 150 మార్కులకు రూపొందించారు.

టెట్‎కు సంబంధించిన పూర్తి సమాచారం కోసం..

For More News..

‘ఆర్ఆర్ఆర్’ చూస్తూ అభిమాని మృతి

పీయూష్ గోయల్‎కు ఎర్రబెల్లి సవాల్

ఏప్రిల్ 14 నుంచి ‘ప్రజా సంగ్రామ యాత్ర’ 2