కరోనా టైమ్​లో ఎడ్యుకేషన్​ లోన్స్​ రికార్డు

  • చదువు కోసం లోన్లు
  • కరోనా టైమ్​లో రికార్డు!
  • ఏడాదిలో రూ. 11,087 కోట్లు డిస్‌‌బర్స్‌‌‌‌మెంట్​
  • 3 లక్షల మందికి కొత్తగా ఎడ్యుకేషన్‌‌ లోన్స్‌‌
  • టాప్‌‌ ఇన్‌‌స్టిట్యూషన్‌‌లలో పెరిగిన అడ్మిషన్స్‌‌

వెలుగు బిజినెస్​ డెస్క్: కిందటేడాది ఎడ్యుకేషన్​ లోన్స్​ రికార్డు లెవెల్​లో పెరిగాయి. ఇండియాలోనే కాకుండా గ్లోబల్​గానూ స్కూళ్లు​, కాలేజీలు కరోనా కారణంగా మూసి వేసినప్పటికీ ఎడ్యుకేషన్​ లోన్స్​కి డిమాండ్​ పెరగడం విశేషం. కరోనా వల్ల స్కూళ్లు, కాలేజీలన్నీ ఆన్​లైన్​ క్లాస్​లకే పరిమితమయ్యాయి. బ్యాంకులు, నాన్​–బ్యాంకింగ్​ లెండర్లు కలిపి 2020 సెప్టెంబర్​దాకా ఏడాది కాలంలో   ఇండియాలో మొత్తం రూ. 11 వేల కోట్లను ఎడ్యుకేషన్​ లోన్స్​గా ఇచ్చాయి. క్రిఫ్​ హైమార్క్​ క్రెడిట్​ బ్యూరో ఈ డేటాను వెల్లడించింది. ఇందులో ఎక్కువ మొత్తం కరోనా టైము(మార్చి – అక్టోబర్​ 2020) లోనే డిస్​బర్స్​ అయ్యాయని పేర్కొంది. ఈ టైములో 3 లక్షల మంది కొత్తగా ఎడ్యుకేషన్​ లోన్స్​ తీసుకున్నట్లు తెలిపింది. అక్టోబర్​ 2020 దాకా చూస్తే ఇండియాలో ఇప్పటిదాకా ఇచ్చిన మొత్తం ఎడ్యుకేషన్​ లోన్స్​ రూ. లక్ష కోట్లకు చేరాయి. ఇది కూడా రికార్డే.

స్కిల్స్‌‌‌‌ పెంచుకుంటున్నారు..

అదనపు అర్హతలను తెచ్చుకోవడం, కొత్త స్కిల్స్​ నేర్చుకోవడం పెరిగిందని, ఇందుకు కరోనా క్రైసిసే కారణమని లెండర్లు, ఎక్స్​పర్ట్స్​ చెబుతున్నారు. ఏదైనా ఎగ్జిక్యూటివ్​ ఎడ్యుకేషన్​ ప్రోగ్రామ్​లో చేరడమో లేదా షార్ట్​ టర్మ్​ అప్​స్కిల్లింగ్​ కోర్సులలో చేరడమో ఎక్కువైందని పేర్కొంటున్నారు. జాబ్​ పోయే అవకాశం ఉండటంతో భయం ఎక్కువైందని, వర్క్​ప్లేస్​లో చోటు చేసుకున్న మార్పులూ కొంత ఆందోళన కలిగించాయని ఎక్స్​పర్ట్స్​ వివరిస్తున్నారు. దీంతోపాటు ఇంక్రిమెంట్లు, ప్రమోషన్స్​ లేకపోవడం కూడా కొత్త కోర్సులలో చేరడానికి కారణమైందని అంటున్నారు. కెరీర్​లో ముందుకెళ్లాలనే కోరికతో తమను తాము అప్​గ్రేడ్​ చేసుకోవాలనుకునే ప్రొఫెషనల్స్​ పెరగడంతో టాప్​ మేనేజ్​మెంట్​ ఇన్​స్టిట్యూట్స్​లో  అడ్మిషన్స్​ బాగా ఎక్కువయ్యాయి. కిందటేడాది రూ. 50 లక్షలు ఆపైన ఎడ్యుకేషన్​  లోన్స్​ తీసుకోవడం తగ్గింది. కానీ, డొమెస్టిక్​ కోర్సులు, అప్​స్కిల్లింగ్​ ప్రోగ్రామ్స్​ కోసం లోన్స్​ తీసుకోవడం పెరిగింది. దీంతో మొత్తం మీద చూస్తే ఎడ్యుకేషన్​ లోన్స్​ డిమాండ్​ పెరిగిందని ఎడ్యువాంజ్​ ఫైనాన్సింగ్​ సీఈఓ వరుణ్​ చోప్రా తెలిపారు. డొమెస్టిక్​ ప్రోగ్రామ్స్​ కోసం తీసుకునే ఎడ్యుకేషన్​ లోన్స్​ రూ. 5 లక్షల నుంచి రూ. 20 లక్షల మధ్యలో ఉంటాయి. భవిష్యత్​లో కూడా ఈ చిన్న టికెట్​ లోన్స్‌​ పెరిగే అవకాశాలున్నాయని భావిస్తున్నట్లు చోప్రా పేర్కొన్నారు. ఇచ్చే అప్పుకు కోలేటరల్​ అడగడం మీద కంటే ​ భవిష్యత్​లో బారోవర సంపాదన ఎలా పెరుగుతుందనే దాని మీదే లెండర్లు దృష్టి పెడతారని అభిప్రాయపడ్డారు.  డొమెస్టిక్​గా స్కిల్స్​ పెంచుకోవాలనుకునే వారి సంఖ్యతోపాటు, ఓవర్​సీస్​ కోర్సులు చేయాలనుకుంటున్న వారి సంఖ్య ఈ ఏడాది 35 శాతం పెరిగిందని అవాన్స్​ ఫైనాన్షియల్​ సర్వీసెస్​ సీఈఓ అమిత్​ గెయిండా అన్నారు.

– దేబాశిష్​ చటర్జీ , డైరెక్టర్​, ఐఐఎం కోజికోడ్​