సీఎం కేసీఆర్ విద్యను యజ్ఞం లా తీసుకున్నారని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి చెప్పారు. రాష్ట్రంలోని గురుకులాలు దేశంలోనే ఆదర్శంగా నిలిచాయన్నారు. ప్రభుత్వ గురుకుల సీట్ల కోసం పోటీ పెరిగిందన్నారు. సర్కారు బడులను ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు మన ఊరు -మన బడి కార్యక్రమానికి సీఎం కేసీఆర్ రూ.7,300 కోట్లు మంజూరు చేశారని తెలిపారు. సర్కారు బడుల అభివృద్ధిలో అందరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.
మరిన్ని వార్తల కోసం