స్కూల్ ఎడ్యుకేషన్ బలోపేతానికి ఎన్​జీవోల సహకారం : విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా

స్కూల్ ఎడ్యుకేషన్ బలోపేతానికి ఎన్​జీవోల సహకారం : విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో స్కూల్ ఎడ్యుకేషన్ బలోపేతానికి ఎన్ జీవోల  సహకారం తీసుకుంటామని విద్యాశాఖ కార్యదర్శి యోగితారాణా తెలిపారు. ప్రస్తుతం ఈ రంగంలో సేవలు అందిస్తున్న వారంతా ఎవరెవరు ఏ ప్రాంతంలో పనిచేస్తున్నారు.. ఎలా విస్తరించాలనుకుంటున్నారనే వివరాలను ఒక ఫార్మాట్ లో ఇవ్వనున్నట్టు చెప్పారు. జిల్లాల్లో కలెక్టర్లు సమావేశాలు నిర్వహించించేలా సూచనలు ఇస్తానని పేర్కొన్నారు. బుధవారం ఎంసీఆర్​హెచ్ఆర్డీలో ఎన్ జీవోఎస్​ కన్సల్టేటివ్ మీటింగ్ నిర్వహించారు. 

ఈ సమావేశానికి చీఫ్ గెస్టుగా అటెండ్ అయిన యోగితా రాణా మాట్లాడుతూ... ఎన్ జీవోలు మంచి ఫలితాలను చూపిస్తే, అవసరాన్ని బట్టి రాష్ట్రవ్యాప్తంగా వారి పనిని విస్తరించి, ప్రభుత్వం నుంచి మద్దతు అందిస్తామని చెప్పారు. ఎన్​జీవోలందరినీ సమన్వయం చేసేందుకు ఎన్​జీఓ కనెక్ట్ ఫ్లాట్ ఫామ్ ఏర్పాటు చేసే ఆలోచనలో  ఉన్నట్టు పేర్కొన్నారు.