విద్యావ్యవస్థను కేసీఆర్‌‌‌‌ భ్రష్టు పట్టించిండు

విద్యావ్యవస్థను కేసీఆర్‌‌‌‌ భ్రష్టు పట్టించిండు
  • నియోజకవర్గంలో గ్రూప్‌‌‌‌ రాజకీయాలకు తావులేదు
  • స్టేషన్‌‌‌‌ఘన్‌‌‌‌పూర్‌‌‌‌ ఎమ్మెల్యే కడియం  శ్రీహరి

స్టేషన్‌‌‌‌ఘన్‌‌‌‌పూర్‌‌‌‌, వెలుగు: మాజీ సీఎం కేసీఆర్‌‌‌‌ విద్యావ్యవస్థను భ్రష్టు పట్టించారని స్టేషన్‌‌‌‌ ఘన్‌‌‌‌పూర్‌‌‌‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరి విమర్శించారు. స్థానిక క్యాంప్‌‌‌‌ ఆఫీస్‌‌‌‌లో శుక్రవారం మీడియాతో మాట్లాడారు. పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు ఏనాడూ ప్రయత్నం చేయలేదన్నారు. విద్యావ్యవస్థపై రివ్యూలు చేయలేదని, ట్రిపుల్‌‌‌‌ ఐటీని గాలికొదిలేశారని మండిపడ్డారు. స్టేషన్‌‌‌‌ఘన్‌‌‌‌పూర్‌‌‌‌లో త్వరలో సీఎం చేతులమీదుగా యంగ్‌‌‌‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌‌‌‌ రెసిడెన్షియల్‌‌‌‌ స్కూల్‌‌‌‌కు శంకుస్థాపన చేస్తామన్నారు.

నామినేటెడ్‌‌‌‌ పోస్టుల్లో, పార్టీ పదవుల్లో ఎక్కువ భాగం కాంగ్రెస్‌‌‌‌ లీడర్లకే ఇస్తామన్నారు. నియోజకవర్గంలో గ్రూప్‌‌‌‌ రాజకీయాలకు తావు లేదన్నారు. ఏఎంసీ చైర్‌‌‌‌పర్సన్‌‌‌‌ జూలకుంట్ల లావణ్య శిరీశ్‌‌‌‌రెడ్డి, వైస్‌‌‌‌ చైర్మన్‌‌‌‌ నూకల ఐలయ్య, కాంగ్రెస్‌‌‌‌ లీడర్లు బెలిదె వెంకన్న, చింతకుంట్ల నరేందర్‌‌‌‌రెడ్డి, రాపోలు మధుసూదన్‌‌‌‌రెడ్డి, తోట వెంకన్న, ఇనుగాల వెంకటేశ్వర్‌‌‌‌రెడ్డి, ఏఎంసీ డైరెక్టర్లు పాల్గొన్నారు.