ఆసిఫాబాద్ జిల్లాలో విద్యా సంస్థలు బంద్

ఆసిఫాబాద్, వెలుగు: వాంకిడి ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కారణంగా ట్రీట్​మెంట్ పొందుతూ స్టూడెంట్ చౌదరి శైలజ మృతి చెందిన ఘటనలో  బుధవారం విద్యార్థి సంఘాలు, కుల సంఘాలు జిల్లా బంద్ కు పిలుపునిచ్చాయి. శైలజ సొంతూరు  వాంకిడి మార్కెట్ లో స్వచ్ఛందంగా బంద్ పాటించారు. వ్యాపార వాణిజ్య దుకాణాలన్నీ మూసివేసి మద్దతు పలికారు. విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడికి యత్నించగా పోలీసులు అడ్డుకోగా.. కొంత ఉద్రిక్తత నెలకొంది.

ALSO READ : దిలావర్​పూర్​లో హైటెన్షన్

విద్యార్థి మృతికి బాధ్యులైన డీటీడీవోతో పాటు ఐటీడీఏ పీవోను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థి కుటుంబంలో ఒకరికి జాబ్ , రూ.50 లక్షల ఎక్స్ గ్రేషియా, ఐదెకరాల భూమిని ఇవ్వాలని కోరారు. అనంతరం కలెక్టర్ వెంకటేశ్ ధోత్రేకు వినతిపత్రం అందజేశారు. కాగజ్ నగర్ డివిజన్ లో మాలి సంఘం నేతలు, విద్యార్థి సంఘాల నేతలు బంద్ లో పాల్గొన్నారు. విద్యార్థి మృతికి కారకులైన వారిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.