హైదరాబాద్, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా కురు స్తున్న భారీ వర్షాల నేపథ్యంలో విద్యాసంస్థలకు శనివారం కూడా ప్రభుత్వం సెలవు ప్రకటించింది. ఇప్పటికే గురువారం, శుక్రవారం సెలవులు ఇవ్వగా, జీహెచ్ఎంసీ పరిధిలోని విద్యాసంస్థలకు మాత్రం శనివారం కూడా సెలవులు ఉంటాయని ప్రకటించింది.
అయితే, గ్రేటర్ హైదరాబాద్‌తో పాటు అన్ని జిల్లాల్లోనూ సెలవులు ఇస్తున్నట్టు విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. స్కూళ్లు, కాలేజీలు సెలవులు ప్రకటించాలని ఆదేశించారు.