తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి ఖమ్మం జిల్లా, వరంగల్ జిల్లాలో మణుగూరు నుంచి కాజీపేట రైల్వే మార్గంలో ఉన్న 198 కిలోమీటర్ల రైల్వే మార్గం గ్రామీణ, పట్టణ ప్రయాణికులకు అనుకూలంగా ఉంటుంది. మణుగూరు కాజీపేట రైల్వే మార్గంలో నడిచే మణుగూరు ప్యాసింజర్ రైలు డోర్నకల్ జంక్షన్ గుండా ప్రయాణిస్తుంది. 2000 మార్చి 23 కరోనా వైరస్ మహమ్మారి ప్రారంభం కాకముందు నడిచిన మణుగూరు ప్యాసింజర్ రైలును తిరిగి ప్రయాణికుల సౌకర్యార్థం పునః ప్రారంభించాలి.
ఈ మేరకు రైల్వే ఉన్నత అధికారులకు, ప్రజాప్రతినిధులకు ప్రయాణికులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ మణుగూరు ప్యాసింజర్ పునః ప్రారంభిస్తే మణుగూరు. కొత్తగూడెం, డోర్నకల్, మహబూబాబాద్, కే సముద్రం, నెక్కొండ, వరంగల్, కాజీపేట, రైల్వే మార్గంలోని వివిధ రైల్వే స్టేషన్ పరిసర ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ప్రధానంగా గ్రామీణ ప్రాంత ప్రయాణికులకు, విద్యార్థులకు, ఉద్యోగస్తులకు, వ్యాపారవేత్తలకు, ఎంతో అనుకూలంగా ఉంటుంది. ప్రయాణ చార్జీలను కూడా గతంలో ఉన్నట్లుగానే తగ్గించాలి. ఈ మధ్యకాలంలో ఎక్స్ ప్రెస్ రైళ్లతో సమానంగా ప్యాసింజర్ రైళ్లకు కూడా ప్రయాణ చార్జీలను పెంచడం జరిగింది. రైల్వే శాఖ ఎక్స్ ప్రెస్ రైళ్లకు, ప్యాసింజర్ రైళ్లకు వేరువేరుగా రైళ్ల ప్రయాణ చార్జీలను వసూలు చేయడం ప్రయాణికులకు శ్రేయస్కరం.
- ఈదునూరి వెంకటేశ్వర్లు,
నెక్కొండ