
పాపన్నపేట, వెలుగు: ఏడుపాయల జాతర ఆదాయం రూ. 61,50,237 వచ్చినట్లు ఆలయ ఈవో చంద్రశేఖర్ వెల్లడించారు. శనివారం గోకుల్ షెడ్ లో హుండీ లెక్కింపు నిర్వహించారు. 16 రోజుల హుండీ ఆదాయం రూ. 24,56, 277, ఒడిబియ్యం ద్వారా రూ. 53,950, కేశఖండనం ద్వారా రూ. 68,150, 100 రూపాయల ప్రత్యేక దర్శనం ద్వారా రూ. 6,02,800, 20 రూపాయల ప్రత్యేక దర్శనం ద్వారా రూ. 2,98,000, లడ్డు ప్రసాదం ద్వారా రూ. 18,74,580, పులిహోర ద్వారా రూ. 7,96,480 వచ్చినట్లు తెలిపారు. జాతర ప్రత్యేక అధికారి కృష్ణ పర్యవేక్షణలో జరిగిన ఈ హుండీ లెక్కింపులో దేవస్థానం సిబ్బంది, రాజరాజేశ్వరి సేవా సమితి సిరిసిల్ల బృందం పాల్గొన్నారు. పోలీసులు బందోబస్తు నిర్వహించారు.