ఏడుపాయల జాతర ఆదాయం రూ.61.18 లక్షలు

ఏడుపాయల జాతర ఆదాయం రూ.61.18 లక్షలు

పాపన్నపేట, వెలుగు: ఏడుపాయల వన దుర్గామాత జాతర ఆదాయం రూ.61.18 లక్షలు వచ్చింది. ఆలయ హుండీలను సోమవారం గోకుల్ షెడ్ లో లెక్కించారు. గడచిన14 రోజుల హుండీలను లెక్కించగా రూ. 24, 75, 366 నగదు, ఒడి బియ్యం టికెట్ల ద్వారా రూ.77, 950,  కేశ ఖండన టికెట్ల ద్వారా రూ.59, 250

  ప్రత్యేక దర్శనం టికెట్ల ద్వారా రూ.9,95,720, లడ్డు విక్రయం ద్వారా రూ.17, 70, 000, పులిహోర విక్రయం ద్వారా రూ.-7, 39, 900 ఆదాయం వచ్చినట్లు చైర్మన్ బాలాగౌడ్, ఈవో మోహన్​రెడ్డి వెల్లడించారు. హుండీ లెక్కింపు ఎండోమెంట్అసిస్టెంట్ కమిషనర్ శివరాజ్, ఇన్​స్పెక్టర్​రంగారావు పర్యవేక్షణలో కొనసాగింది.