ఇంకా జలదిగ్బంధంలోనే దుర్గమ్మ ఆలయం

పాపన్నపేట, వెలుగు : ఏడుపాయల వనదుర్గ భవానీ మాత ఆలయం బుధవారం కూడా జలదిగ్బంధంలోనే ఉంది. నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలతో పాటు మంజీరా బ్యారేజ్ నుంచి 12,000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేయడంతో వనదుర్గ ప్రాజెక్ట్​లోకి నీళ్లు భారీగా వస్తున్నాయి.

ALSO READ:ఇలాంటి చెల్లెలు ఉంటే నా సామిరంగా..ఆ అలవాటు ఉన్న అన్నయ్యలకు పండగే

దీంతో ఘనపురం అనకట్ట పొంగిపొర్లుతోంది. ప్రాజెక్ట్​ పై నుంచి 20 వేల క్యూసెక్కుల నీళ్లు నిజాంసాగర్​ వైపు వెళ్తున్నట్లు నీటి పారుదల ఏఈ విజయ్​ తెలిపారు. ఆలయం వద్ద నది ఉధృతంగా ప్రవహిస్తుండటంతో రాజగోపురంలోనే అమ్మవారికి పూజలు చేస్తున్నారు.