వనదుర్గ భవానీ మాత ఆలయం భక్తులతో కిటకిట

వనదుర్గ భవానీ మాత ఆలయం భక్తులతో కిటకిట

 పాపన్నపేట, వెలుగు : ఏడుపాయల వనదుర్గా భవానీ మాత ఆలయం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. దూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు మంజీర పాయల్లో స్నానాలు చేసి అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం అమ్మవారికి ఒడిబియ్యం పోసి, బోనాలు  సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.

కాగా ఆదివారం నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవ రెడ్డి, రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శరత్ అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు వారికి తీర్థ ప్రసాదాలు అందజేసి శాలువాతో సన్మానించారు.